తెనాలి రాముడి కళ

Posted On అక్టోబర్ 4, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

భవనపు = palace
చిత్రాలు = pictures, paintings
చిత్రకారుణ్ణీ = painter
శరీరపు = body
అమాయకంగా = innocently
భాగాలు = parts
తరబది = continuously
రాత్రీ పగలూ = night and day
మాసిపోయిన = faded
ఆహ్వానించాదు = invited
దొద్దిలూపలికి = into the cow stall
సమాధానం = answer

రమ్య

కొత్త పదజాలం

Posted On అక్టోబర్ 1, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

చారిత్రక = historical
స్ధలాలు = sites
ఆధ్యాత్మిక = spiritual
మానిసిక = mental
ఆత్మిక = soul
యుగం = era
పూర్వ = old
మధ్య = medieval/ middle
శకం = era
ఆధునిక = modern
వ్యపారం = commerce
శిల్పం = sculpture
విగ్రహం = statue
కాల రేఖ = time line
రాజ్యం = kingdom
విజయం = conquer
జయించు = to win/ to conquer
అక్రమ సంఘటన = notable event
మలుపు = turning point
రహస్య = secret
సోరంగ = cave
సామ్రాజ్యం = empire
అనువైన = appropriate
తగిన = appropriate
జిల్లా = district
చట్టం law
బొగ్గు =coal
గనులు = mine
పటం = map
సంఘర్షణ = conflict/ friction
మత మర్పిడి =religious conversion
సైన్యం = army
సేన = army
నిధ్వంసం = destruction
సున్నం = limestone
కేంద్రం = center

Enjoy,

రమ్మి బేర్!

నా అభిప్రాయంలో…కథలు ఎందుకు చదవాలి?

Posted On సెప్టెంబరు 18, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

చాలా మంచి కథలా ఏమీ లేదు. నేను కథలు అనేక కారణాలవల్ల చదువుతాను. కథలు చదవడంతో చూడలేనివి చూడొచ్చు, వినలేనివి వినొచ్చు, రుచి చూడలేనివి రుచి చూడొచ్చు, వాసన చూడలేనివి వాసన చూడొచ్చు, అనుభవించలేనివి అనుభవించొచ్చు. కథలు తలపులనీ, అనుభవాలనీ, ఊహలనీ మిగులుస్తాయి కాబట్టి పుస్తకం చదివితే వేరు శకాలగురించి, వేరు వాతావరణాలగురించి, వేరు మనుషులగురించి నేర్చుకోవచ్చు. కథలకి ఏమైనా తెలియని చోట్లకి తీసుకెళ్లే శక్తి వుంది. కథలనించి నేర్చుకున్న పాఠాలు గత తప్పులు చేయకుండా నిరోధించొచ్చు.

కథలు ప్రజలమధ్య ఉమ్మడి బంధంగా పనికి వస్తాయి. జనం ఎక్కడనించి వచ్చినా, ఒకే రకమైన కథలు విని వుండొచ్చు. ఈ కథలు మొదలుగా ఇతరలతో బంధాలు పెట్టడానికి వాడొచ్చు. కథల్లో పేరొందిన పాత్రలకి allusions చేయడం మంచిది. కథలు చాలా మంచి వినోదం కూడా! మంచి కథలు ప్రజలని ఏడిపించొచ్చు, నవ్వించొచ్చు, ఆశ పెట్టొచ్చు, నిద్ర పోవడానికి సాయం చేయొచ్చు కూడా.

నాకు కథలు చదవడానికి నచ్చిన కారణం బుద్ధికోసం exercise. అందరూ “an apple a day keeps the doctor away” అని విన్నారు కానీ ఎవరూ “100 pages a week keeps the mind ठीक” అని వినలేదు. రోజూ బడికి వెళ్తున్నప్పుడు నేకొక పుస్తకం చదవడం అలవాటు. నేను క్లాస్ చేరుకున్నప్పటికి నా మతి హుషారుగా వుంటుంది. కథలు చదవాల్సిన ఆఖరి కారణం మంచి కథలు మంచి సినిమాలుగా మార్చొచ్చు! ఉదాహరణకి Jane Austen రాసిన పుస్తకం “Pride and Prejudice” ఐశ్వర్య రాయ్ నటించిన “Bride and Prejudice”గా మార్చారు. ఏం సినిమా!!! కథ మార్చాక నాకు పుస్తకానికీ సినిమాకీ తేడాలు ఏమిటో చూడడం అంటే ఇష్టం!

“ఈనాడు” వ్యాసం నించి మాటలు

Posted On సెప్టెంబరు 18, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

పథకం – scheme

నేరం -crime

అత్పత్తి (అత్పత్తిదారు) -production (producer)

ముద్ర – stamp

అక్రమ (అక్రమంగా) – improper/illegal (improperly/illegally)

జాబితా – list

చేర్చు – to add, enroll, join

నియంత్రించు – to control

కృషి చేయు – to make an effort

ప్రశంసించు – to compliment

చర్య – action

ప్రభావితం – effect, influence

అధ్యక్షుడు – president

వ్యక్తం చేయు – to express

మేరకు – according to, as per

విదేశాంగ శాఖ – foreign relations department

లేఖ – letter (as in mail)

పడమర/పశ్చిమ – West

సరిహద్దు – border

పలు – several

ఆందోళన – worry

రవాణా – transportation

కొనసాగించు – to continue until completion (transitive)

పేర్కొను – to disclose

అగ్రస్థానం – top position

ఇతర – other

వృధా – waste

Akbar and Birbal -1

Posted On మే 9, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

అక్బరుకి మనవలూ మనవరాళ్లంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే వాళ్లతో సరదాగా కథలు చెబుతూ ఆట్లాడుతూ ఉండేవాడు.ఓరోజు అక్బర్ మనవల్లో చిన్నవాడొకడు వచ్చి ‘తాతయ్యా మీ మూతిమీద నల్లగా ఏదో ఉంది, కాస్త వంగండి తీస్తాను’ అన్నాడు అక్బరుతో. అక్బర్ ముందుకు వంగగానే… మీసాల్ని పట్టుకుని లాగేసి ‘హహ్హహ్హ’ అని నవ్వుతూ పరుగు తీశాడు.
‘హారి భడవా’ అనుకుంటూ దర్బారుకి దారితీశాడు అక్బరు. మంత్రులతో మాట్లాడుతూ… ‘ఈరోజు ఉదయం ఒకరు నా మీసాలు పట్టుకొని లాగారు. వారికి ఏం శిక్ష వేయాలి’ అని అడిగాడు. దానికి ఒక్కో మంత్రి ఒక్కోలా సమాధానమిచ్చారు. ఒకరు వంద కొరడా దెబ్బలు కొట్టాలని చెబితే… మరొకరు జైల్లో పెట్టించమని చెప్పారు.

ఇలా చాలా సమాధానాలే వచ్చాయి మంత్రుల నుంచి. కానీ బీర్బల్ మాత్రం ఏమీ మాట్లాడలేదు.

‘బీర్బల్ నీవేమంటావు’ అడిగాడు అక్బర్.

‘మీ మీసం లాగిన వారిని తప్పనిసరిగా ముద్దుపెట్టుకోవాల్సిందే’ అన్నాడు బీర్బల్.దర్బారులో అందరూ బీర్బల్ వైపు చూశారు.

‘ఎందుకలా చేయాల’ని అడిగాడు అక్బరు.

‘రాజా… మీ మీసాన్ని ఇతరులెవరైనా లాగి ఉంటే మీరు ఇప్పటికే ఆ వ్యక్తికి తగిన శిక్ష వేసి ఉండేవారు. అలా చేయలేదంటే… మీసాన్ని లాగింది మీ మనవడో మనవరాలో అయి ఉండాలి. లేకుంటే మీరిలా సభలో ఇంత ప్రశాంతంగా ఉండరు’ అన్నాడు బీర్బల్.
‘శభాష్, నీ తెలివికి మెచ్చాం. అందుకో బహుమానం’ అంటూ బీర్బల్‌కి పళ్లెం నిండా బంగారు కాసులు అందించాడు అక్బర్.

Posted On మే 6, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

ప్రతిభావంతుడు

1913 లో ఒక జనవరి నెల.. ఉదయం. లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం. ముప్ఫై ఏడేళ్ల ప్రొఫెసర్ జి. హెచ్. హార్డీ తన విభాగంలో కూర్చుని ఏవో లెక్కలతో కుస్తీ పడుతూ ఉండగా.. ఓ కవరు అందింది. పైన చూస్తే.. భారతీయ స్టాంపులు. తనకెవరు రాస్తారు? అదీగాక, ఇంత పెద్ద కవర్లో.. అన్ని కాగితాల్తో రాయగల విషయం ఏమిటి? ఇలా బోలెడన్ని ప్రశ్నలు ఆయనలో గిర్రున తిరిగాయి.

అప్పటికే గణితశాస్త్రంలో మేధావిగా పేరు పొందిన ఆయనకు ఆ కవరు పంపినది మద్రాసులోని ఒక కార్యాలయంలో పనిచేసే ఓ చిన్న గుమస్తా. విషయం ఏమంటే పరిష్కారాలు లభించని కొన్ని చిక్కు లెక్కలు! ‘ఇదేం పిచ్చితనం.. అంత దూరం నుంచి నాకు పంపడం ఎందుకు? అక్కడే ఎవర్నైనా అడిగి ఉంటే సరిపోయేదిగా..’ అనుకుంటూ ఒకో కాగితాన్నే పరిశీలించిన హార్డీ.. ఐదారు పేజీలు తిప్పేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

ఎవరైనా సరే పరిష్కరించగలిగే అలాంటిలాంటి లెక్కలు కావవి. గణిత సాగరంలో మునకలు వేసిన గొప్ప మేధావి, తన తోటి వారు పరిష్కరించలేకపోతారా.. అన్న ఆశతో పంపిన చిక్కు ప్రశ్నలు అవన్నీ. సహోద్యోగులు కొందరు కొట్టిపడేశారు కానీ, ప్రొఫెసర్ హార్డీకి మాత్రం అవి పంపించిన చిన్న గుమస్తా అంటే అవ్యాజమైన గౌరవం, అంతకు మించిన అభిమానం కలిగాయి. ఆ గుమస్తా ఎవరంటే – మన గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. అతను పంపిన చిక్కుముడులు విడదియ్యాలని, వీలైతే అంత ప్రతిభావంతుణ్ని కేంబ్రిడ్జికి తీసుకురావాలనీ ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు హార్డీ. అదే గణిత చరిత్రను ఓ మలుపు తిప్పిన సంఘటన.

1914లో రామానుజన్ ఇంగ్లండు వెళ్లాడు. నిరంతర గణిత సాధన, కఠోర పరిశ్రమల వలన రామానుజన్‌కు ‘ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ’, ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవాలు పొందిన తొలి భారతీయుడు రామానుజన్. ప్రతికూల వాతావరణం, ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండటం రామానుజన్ మేధస్సును ఏమీ చేయలేకపోయినా, అతని శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేశాయి. దీనితో 1919లో ఇండియాకు వచ్చాడు. ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయింది రామానుజన్‌కి. ఆస్పత్రిలో నిస్సహాయంగా పడుకొని ఉన్నాడు. హార్డీ కారు దిగుతుంటే, అతని కారు నెంబర్ చూశాడు శ్రీనివాస రామానుజన్. ‘హలో సర్.. మీరొచ్చిన కారు నెంబర్ 1729′

‘అవును. అందులో చెప్పుకోదగిన విశేషం ఏముంది?’ ‘ఉంది. 1729= 10 3 +9 3 =12 3 +1 3 గా రాయవచ్చు. అంటే రెండు విభిన్న ఘనాల మొత్తంగా రెండు విధాలుగా రాయగల అతిచిన్న సంఖ్య 1729.’ మృత్యుశయ్య మీద ఉండి కూడా గణితంలో కొత్త విషయాలను అలవోకగా చెబుతున్న శ్రీనివాస రామానుజన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు హార్డీ.

పిల్లలూ.. ఈ అగణిత ప్రతిభావంతుడి గురించి తెలుసా మీకు? ఆయన 20వ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, భారతదేశ కీర్తిని చాటిచెప్పిన వ్యక్తి. శ్రీనివాస రామానుజన్ గతించి నేటికి 88సంవత్సరాలు. రామానుజన్ 1887లో తమిళనాడులోని ఈ రోడ్డులో జన్మించాడు. కుంభకోణం టౌన్ హైస్కూల్లో చదివి, మద్రాసు యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తరవాత ఎఫ్.ఎ.లో చేరినా గణితం పట్ల విపరీతమైన శ్రద్ధతో, మిగిలిన సబ్జెక్టులు నిర్లక్ష్యం చేయడం వలన పరీక్ష తప్పాడు. దీనితో వచ్చే స్కాలర్‌షిప్ పోయింది. విద్యార్హత లేని కారణంగా తర్వాత ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వింత పజిల్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్(వితత భిన్నాలు), ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి అంశాలపై పరిశోధనలు చేశాడు. 1920, ఏప్రిల్ 26న రామానుజన్ మరణించాడు. ఆయన స్మారకార్థం భారత ప్రభుత్వం 1962 డిసెంబర్ 22న తపాలాబిళ్ళను విడుదల చేసింది. రామనుజన్, హార్డీల పరిశోధనాంశాలను ఇప్పటికీ ఎన్నో యూనివర్సిటీ విద్యార్థులు పాఠ్యాంశంగా చదువుతున్నారు.


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

అమ్మ భాష

Posted On ఏప్రియల్ 30, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

ఎప్పుడూ
ఎదురుచూసేది అమ్మే!

లోకమంతా తిరిగి
అలిసిపోయి ఇంటికొస్తాను

తలుపు దగ్గిర అమ్మ
నా కోసం.
ఎప్పుడూ ఎదురుచూస్తూనే
వుంటుంది అమ్మ.

ఎక్కడెక్కడో తిరిగి
ఏమేమో తింటాను.

అబ్బే, అస్సలు కడుపు నిండదు.

కాస్త పెరుగన్నం కలిపి పెడుతుంది అమ్మ

అంతే!

కడుపులో చల్లగా
మనసులో చల్లగా.

అలసట అంతా ఎగిరిపోతుంది.

నేను కడుపు నిండా తిన్నప్పుడు
అమ్మ కళ్ళలో
ఎంత సంతోషం!

ఎక్కడెక్కడో ఏమేమిటో
మాట్లాడతాను
ఇంగ్లిష్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్.

అస్సలు మాట్లాడినట్టే వుండదు.

ఎలా వున్నావు
అని అమ్మ
ఒకే ఒక్క మాట అంటుంది.

బావున్నాను అమ్మా
అంటాను నేను,
అమ్మ భాషలో.
నా తెలుగు భాషలో.

అంతే!
ఆ క్షణం ఇంకేమీ అక్కరలేదు
అనిపిస్తుంది.

అది నా భాష
అది నా అమ్మ భాష
అది నా ఆత్మ భాష

దేవుడా,

నన్ను ఎప్పుడూ
ఆ భాషలోనే
మాట్లాడనివ్వు.

 

 

నాకు నచ్చని వ్యక్తి

Posted On ఏప్రియల్ 15, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

నాకు నచ్చని వ్యక్తి

ఆవేశం, అసహనం, ద్వేషం, అనుమానం, పాడు బుద్ధి, కుటిలత్వం–ఇవన్నీ కలిస్తే మిస్టర్ రావణ. నాకు నచ్చని వ్యక్తి రావణ.

రావణ బాగా చదువుకున్నవాడే. కాని, అతని చదువు అంతా అహంకారం అయ్యింది.
రావణ గొప్ప వీరుడే, కాని అతని వీరత్వం అంతా చెడు దారి పట్టింది.
రావణ గొప్ప సాహసి. కాని, అతని సాహసం అంతా క్రూరత్వం అయ్యింది.

రామాయణం చదివిన వాళ్ళెవరికయినా రావణుడు యెలాంటి వాడో, ఎంత దుర్మార్గుడో తెలుసు.

మాయ చేసి, సీతని యెత్తుకుపోయాడు.
రాముడిని చంపడానికి రకరకాల కుట్రలు చేసాడు.

కాని, ఎప్పుడయినా మంచి గెలుస్తుంది. చెడు వోడిపోతుంది.

అందుకే రావణుడు వోడి పోయాడు. రాముడు గెలిచాడు.

ఉగాది పండగ వచ్చింది

Posted On ఏప్రియల్ 7, 2008

Filed under Uncategorized

Comments Dropped leave a response

ఉగాది పండగ వచ్చింది

ఇవాళ తెలుగు వాళ్లకి కొత్త సంవత్సరం మొదలయ్యింది.
తెలుగు కొత్త సంవత్సరాన్ని ఉగాది అంటారు.
ఉగాది అంటే ‘యుగానికి ఆది” అని అర్థం.
ఆది అంటే – మొదలు – అని అర్థం. (మరింత చదవండి)

Posted On ఏప్రియల్ 5, 2008

Filed under Uncategorized
ట్యాగులు:

Comments Dropped leave a response

తరువాతి కాగితం »